Wednesday, June 6, 2012

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న .... నీ కష్టమంతా తీరునురో చిన్నన్న ....


నేటి తో రోహిణి కార్తి దాదాపు  పూర్తీ అయింది , ఈ కాలమ లో రోళ్ళు-రోకళ్ళు ఎండా వేడి కి పగులుతాయి అట ..... ఈ సంవత్సరం ఎండలు అది నిజమే అనే ల ఉన్నాయి . రోహిణి కర్తే పూర్తీ అవగానే , ఏరువాక పౌర్ణమి ఆరంబం అయింది . నైరుతి రుతుపవనాలు చురుకుగ కదులుతున్నాయి . ఇది ఏంటో శుభా సూచకం , రైతు లకు ఆశాజనకం .

పల్లెతురుల్లో , రైతు కుటుంబాల్లో ఏరువాక పౌర్ణమి ఎంతో ప్రాదాన్యం ఉంటది .ఏరువాక పౌర్ణమి సందర్బంగా వ్యవసాయ పనులను రైతులు ప్రారంబమిస్తాడు, ఖరీఫ్ పంట వేయడానికి రైతు సన్నడమవుతాడు . ఈ రోజు పొలము పని మొట్లు , నాగలి , పార , ఇతర వ్యవసాయ పరికరాలను మరీయు పశువులను పూజించి భూమి ని దున్నడము మొదలు పెడుతారు . రైతు , అతని భార్య ఇతర కుటుంబ సబ్యులు ఈ రోజు నవ దాన్యాలను పూజించి దున్నిన దుక్కి లో శుభా సూచకంగా వేస్తారు . వర్షాలు బాగా పడాలని , పంట బాగా పండాలని , గిట్టు బాట ధర రావాలని వారి కుల దేవతలను ఆర్జిస్తారు . నేటి నుండి పంట చేతి కి వచ్చే దాక రైతు పోద్దనక, రాత్రనక పొలం పనుల్లో నిమగ్నవుతాడు . ఒళ్ళు మైమరిచి పని చేస్తాడు .

ఈ ఖరిఫ్ లో అన్నదాతలకు మంచి పంట పండాలని , రైతులు మంచి అబివృద్ది సాదించాలని మనమందరము కోరుకుందాము . మనకు సమృద్ది గ దాన్యా రాశులను అందిచ్చి , మనకు 3 పూటల తిండి పెడుతున్న రైతు సదా సుఖంగా ఉండాలని మనసార కోరుకుందాము , రైతే రాజు అని నినదిద్దాము .

No comments: